
హాస్య రచన పోటీల్లో ప్రతిభ
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘శ్రుతి మించక ముందే దూరంగా ఉండండి’ అనే అంశంపై జిల్లాస్థాయి హాస్య రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని దివ్వకు రూ.560, ద్వితీయ బహుమతి పొందిన మోడల్ స్కూల్‌కు చెందిన కౌషిక్‌కు రూ.300, తృతీయ బహుమతి పొందిన జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన రాజ్యలక్ష్మికి రూ.200 నగదును జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అందించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకట్రావ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.