
● పదేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు బాధ్యతలు ● ప్రభుత్వ న
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయనే భావనలో చాలా మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో ఉంది. ఫలితంగా రూ.లక్షలు ఖర్చు చేసినా సరే వారి పిల్ల లను ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి స్కూళ్లలో వసతుల కల్పనతోపాటు మరింత ప ర్యవేక్షణ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. పాఠశాలలను తనిఖీ చేసేందుకు ఉపాధ్యాయులను నియమించనుంది. వారు ని త్యం తనిఖీలు చేపట్టి పరిశీలించిన అంశాలను ఎ ప్పటికప్పుడు జిల్లా శాఖ అధికారికి నివేదించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీతో పర్యవేక్షకులను ఎంపిక చేయాలని ఎస్‌పీ డీ నవీన్ నికోలస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలల తనిఖీ..
పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా స్కూల్ గ్రేడ్ టీచర్లను తనిఖీ అధికారులుగా నియమించి ప్రాథమిక పాఠశాలలు తనిఖీ చేయించనున్నారు. రోజుకు కనీసం రెండు పాఠశాలుల వీరు పరిశీలించాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్‌ను నియమించుకోవాలి. వారు రోజుకు రెండు బడులను పరిశీలించారు. మూడు నెలల్లో కనీసం 50 ఉన్నత పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించారు. అర్హత ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేయనున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 102, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలల తనిఖీలతోపాటు పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించే విధానంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండలస్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు ఉన్నారు. ఉన్నత పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లు పర్యవేక్షించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. తనిఖీ సమయంలో ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగా మారింది. మండలానికి ఇద్దరిని నియమించడం వల్ల జిల్లాలో 15 మండలాల్లో 30 మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరమవుతున్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతుందని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సీఆర్‌పీలే చేశారు..
గతంలో ప్రాథమిక పాఠశాలు, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత సీఆర్‌పీలే చూసుకున్నారు. వివరాలు ప్రత్యేక ప్రోఫార్మాలో ఉన్నతాధికారులకు అందించేవాళ్లం. ఇతర పనులు పెరగడంతో పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయలేకపోతున్నాం. పర్యవేక్షణ అధికారుల బాధ్యత సీఆర్‌పీలకే ఇవ్వాలి.
– డి.పవన్‌కుమార్,
సీఆర్‌పీల సంఘం జిల్లా అధ్యక్షుడు
నిర్ణయం సరికాదు
ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా నియమించాలనే నిర్ణయం సరికాదు. ఇప్పటికే డీఈవో, ఎస్‌వోలు, ఎంఈవో, సీఆర్‌పీలు తనిఖీలు చేపడుతున్నారు. బడుల బలోపేతం చేయాలంటే మరికొంత మంది సీఆర్‌పీలను నియమించాలి, బాధ్యతలు పెంచాలి. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. – ఆడే ప్రకాశ్,
పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు

● పదేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు బాధ్యతలు ● ప్రభుత్వ న

● పదేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు బాధ్యతలు ● ప్రభుత్వ న