
జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో పనిచేస్తు న్న ఉద్యోగులకు జాప్యం లేకుండా సీఎంపీఎ ఫ్ సేవలు అందిస్తామని సీఎంపీఎఫ్ రీజియ న్ కమిషనర్లు హరి పచౌరీ, గోవర్ధన్ తెలిపా రు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ప్రయాస్ సమావేశం నిర్వహించా రు. సీఎంపీఎఫ్ లావాదేవీలన్నీ సీకేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని తెలిపా రు. ఉద్యోగులు మధ్యవర్తులు లేకుండా సీఎంపీఎఫ్ సేవలు పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా బెనిఫిట్స్‌కు అర్హులు, పెన్షన్, రివైజ్డ్ పెన్షన్‌పై అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేశారు. జీఎం విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎంపీఎఫ్ వ్యవహారాలను పర్యవేక్షించే క్లర్కులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో లే కుండా చూడాలన్నారు. ఎస్వోటూజీఎం రాజ మల్లు, డీవైపీఎం రాజేశ్వర్‌రావు, సీనియర్ పీవో ప్రశాంత్, సీఎంపీఎఫ్ ఉద్యోగులు మనోహర్, అనిత తదితరులు పాల్గొన్నారు.