
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
మంచిర్యాలక్రైం: కాళేశ్వరం జోన్‌స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కాళేశ్వరంజోన్‌లోని రామగుండం పోలీస్ కమి షనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సి బ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదా వరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, ర మేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్‌గౌడ్, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.