
సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం
సిర్పూర్(టి): సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆర్‌ఎంపీ, పీఎంపీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయొద్దని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలు పాటించని క్లినిక్‌లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్దార్థ, అధి కారులు సఫీద్దున్, రవిదాస్, శ్రీకాంత్, సందీప్, ఆర్‌ఎంపీ సంఘం నాయకులు రాజేశ్వర్, సత్యనారా యణ, నాందేవ్, సుకృజీ తదితరులు పాల్గొన్నారు.