
నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దు
కెరమెరి(ఆసిఫాబాద్): ఫర్టిలైజర్ దుకాణాల్లో నిషేధిత విత్తనాలు, ఎరువులు అమ్మొద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. గోదాంలు, తూకం యంత్రాలు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణాల ఎదుట స్టాక్, నిల్వ, ధరల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ భూమేశ్వర్, ఏడీఏ వెంకట్, ఏవో యుగేందర్ ఉన్నారు.