
కలెక్టర్‌కు వినతి
ఆసిఫాబాద్‌రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని డీఐఎఫ్‌ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు గురువారం వినతిపత్రం అందించా రు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు కార్తీక్, దినకర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా వేలాది మంది చదువుకుంటున్నారని తెలిపారు. అయితే సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో స్కూళ్లు మూతబడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికై నా పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.