
బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్ తొలగింపు
ఆసిఫాబాద్: విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగించాలని విద్యుత్ శాఖ జి ల్లా నోడల్ అధికారి కళాధర్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గృహజ్యోతియేతర విద్యుత్ కనెక్షన్ల బకాయిలు వందశాతం వసూలు చేయాలన్నారు. సక్రమంగా చెల్లించని వారి కనెక్షన్లు తొలగించాలని సూచించారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారావు, ఏఏవో తుకారాం, ఏఈలు లక్ష్మీరాజం, ఊర్మిళ, సిబ్బంది పాల్గొన్నారు.