
రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలోని రైతులకు ఇ బ్బందులు రానీయకుండా, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో పంపిణీ చేస్తున్న డీఏపీ, యూరియాను బుధవారం పరిశీలించారు. పలువురు రైతులు యూరియా, డీఏపీ సరిపడా ఇవ్వడంలేద ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. వెంట నే సంబంధిత ఏవో రామకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉ న్నాయని, యూరియా తగ్గించి నానో యూరి యా వాడాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఏవో వివరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ అధిక ధరలకు అమ్మితే వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.