
సామర్థ్యాల ఆధారంగా బోధించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు వారి వి ద్యాసామర్థ్యాల ఆధారంగా బోధించాలని అ దనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మండలంలోని ఝరి ప్రాథకోన్నత పాఠశాల, హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్ష ప్రశ్నపత్రాలను పరిశీలించారు. వి ద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించి ప్రశ్నలు అడిగారు. పుస్తకాలు, నోట్‌బుక్స్, యూని ఫాం పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు కొఠారి, రింగన్‌ఘాట్‌లో ని ర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లతోపాటు మండల కేంద్రంలోని మోడల్ గృహాన్ని పరిశీలించారు. ఎంఈవో ఆడే ప్రకాశ్, ఎస్‌వో శ్రీనివా స్, ఎంపీడీవో అంజద్‌పాషా, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య తదితరులు ఉన్నారు.