
యూరియా కోసం అగచాట్లు!
కౌటాల/కాగజ్‌నగర్‌టౌన్: కౌటాల సహకార సంఘం కార్యాలయంలో యూరియా బస్తాలు తీసుకునేందుకు కౌటాల, చింతలమానెపల్లి మండలాలకు చెందిన రైతులు మంగళవారం పెద్దఎత్తున తరలివచ్చారు. కౌటాల రైతు వేదికలో రైతుల వద్ద నుంచి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలు తీసుకొని ఎకరానికి రెండు బస్తాలుగా చిట్టీలు రాసిచ్చారు. భారీగా రైతులు తరలిరావడంతో సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేసి రైతుల పేర్లు పిలిచి పో లీసుల పహారాలో ఏఈవోలు రైతులకు బస్తాల కే టాయింపు చిట్టీలు అందజేశారు. అనంతరం రైతులు సహకార సంఘంలో బస్తాలు తీసుకోవడానికి క్యూలైన్‌లో నిలబడ్డారు. కౌటాల మండలానికి 800 బస్తాలు, చింతలమానెపల్లి మండలానికి 800 యూరియా బస్తాలు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.
సిర్పూర్(టి) మండలంలో..
సిర్పూర్(టి) మండలంలోని రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట మంగళవారం నిరీక్షించారు. రైతులు యూరియా తీసుకునేందుకు ఉదయం కార్యాలయానికి వచ్చి సరిపడా ఎరువులు లేకపోవడంతో వేచిచూశారు. ఈ విషయమై ఏవో గిరీశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా పీఏసీఎస్‌లో ట్యాబ్ సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమైందని, ప్రతీ రైతుకు ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేయనున్నట్లు తెలిపారు.

యూరియా కోసం అగచాట్లు!