
లక్ష్యానికి మించి ఉత్పత్తి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో జూన్‌లో నెలవారీ లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జూన్‌లో బెల్లంపల్లి ఏరియాకు రెండు లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించగా, 2.62 లక్షల టన్నులతో 131 శాతం ఉత్పత్తి సాధించామన్నారు. కొత్త గనుల ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గోలేటి ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోందన్నారు. ఈ ఏడాదిలోనే స్టేజ్‌వన్ అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహరా, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పీవో ప్రశాంత్ పాల్గొన్నారు.