పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:34 AM

పారిశ

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి

మధిర: మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కేంద్ర మంత్రి జిటన్‌ రామ్‌ మాంజీకి వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రిని కలిసిన వారు మధిర మండలం ఎండపల్లి, ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవేకాక తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఎంపీ మల్లు రవి ఉన్నారు.

10న జవహర్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

మధిర: మధిర మండలం వంగవీడు సమీపాన రూ.600 కోట్ల నిధులతో నిర్మించే జవహర్‌ ఎత్తిపోతల పథకానికి ఈనెల 10న శంకుస్థాపన జరగనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పథకానికి శంకుస్థాపన చేస్తారు.

స్ఫూర్తిప్రదాత జయశంకర్‌

ఖమ్మం సహకారనగర్‌: ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి కొనియాడారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఏ.శ్రీనివాస్‌, కె.సత్యనారాయణ, శ్రీలత, ఎన్‌.మాధవి, శ్రీనివాసరావు, వేలాద్రి పాల్గొన్నారు.

వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిపై 17మంది వైద్యులను నియమించనుండగా, దరఖాస్తుదారులకు బుధవారం డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. డీసీ హెచ్‌ఓ కె.రాజశేఖర్‌గౌడ్‌, డీఆర్వో పద్మశ్రీ, జనరల్‌ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ బి.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యాన 19మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించగా, గురువారం తుది జాబితా విడుదల చేస్తామని వారు తెలిపారు.

ప్రవేశాలు, హాజరు పెరగాలి

ఎర్రుపాలెం: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలతో పాటే విద్యార్థుల హాజరు పెరిగేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌మీ డియట్‌ విద్యాశాఖాధికారి కె.రవిబాబు సూచించారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడాక పిన్సిపాల్‌ ఆర్‌.రవికుమార్‌, అధ్యాపకులతో సమావేశమై ప్రవే శాలు, హాజరు పెంపు, అభివృద్ధి పనుల్లో నాణ్యతపై సూచనలు చేశారు.

జిల్లాకు 2,600 బ్యాలెట్‌ బాక్స్‌లు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన 2,300బ్యాలెట్‌ బాక్స్‌లను ఇటీవల గుజరాత్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. బుధవారం మహా రాష్ట్ర నుంచి మరో 300బ్యాలెట్‌ బాక్స్‌లు కేటా యించగా, రెండు, మూడు రోజుల్లో జిల్లాకు చేరతాయని అధికారులు తెలిపారు.

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి
1
1/3

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి
2
2/3

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి
3
3/3

పారిశ్రామిక పార్క్‌లకు చేయూత ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement