
బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
ఐసీడీఎస్ సీడీపీఓ దయామణి
కారేపల్లి: బాల్యవివాహాలు నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ దయామణి అన్నారు. ఆదివారం కారేపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బాల్యవివాహాలు సమాజానికి ప్రతిబంధకాలని, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని తెలిపారు. 18 ఏళ్లు నిండని బాలికల్లో శరీర, మానసిక పెరుగుదల, లైంగిక పరిపక్వత సరిగా ఉండదని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రామ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపవర్‌వైజర్, తహసీల్దార్, సీడీపీఓ, ఆర్‌డీఓ, కలెక్టర్‌లకు బాల్య వివాహాలు నిరోధించే అధికారం ఉందని వివరించారు. బాల్య వివాహం జరుగుతోందని తెలిస్తే 1098కి సమాచారం ఇస్తే హెల్ప్‌లైన్ సిబ్బంది, కార్యదర్శి, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు ఆ ఇంటిని సందర్శించి విచారణ చేపడతారని చెప్పారు.