
ఈనెల 21నుంచి ఎన్‌సీసీ క్యాంప్
వైరా: వైరా శాంతినగర్‌లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్‌లో ఎన్‌సీసీ 11(టీ)వ బెటాలియన్ ఆధ్వర్యాన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి 30 వ తేదీ వరకు క్యాంపు జరగనుండగా, ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కే.భద్ర, ఏఓ కల్నల్ నవీన్ యాదవ్ శుక్రవారం పాఠశాల ఆవరణలో పరిశీలించారు. క్యాంప్‌నకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి 700మంది కేడెట్లు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు దేశభక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేశ్వరరావు, డైరక్టర్ కుర్రా సుమన్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఏఓ నరసింహారావు పాల్గొన్నారు.
కాంటా వేయడం లేదని రైతుల ధర్నా
నేలకొండపల్లి: రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో ఎన్నాళ్లు పడిగాపులు కాయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. నేలకొండపల్లి మండలం అనాసాగారంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నెల క్రితం రైతులు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం తీసుకొచ్చారు. ఈ ధాన్యానికి ఇప్పటివరకు కాంటా వేయకపోవడంతో తహసీల్ వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా చేశారు. దీంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే కాంటాలు వేయిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం
బోనకల్: ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నందున మెరుగైన చికిత్స అందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కళావతిబాయి వెల్లడించారు. బోనకల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, మందుల నిల్వలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, పంచాయతీరాజ్ ఉద్యోగుల సమన్వయంతో డ్రై డే – ఫ్రై డే నిర్వహిస్తూ దోమలను అరికట్టాలని తెలిపారు. అనంతరం జాతీయ డెంగీ నివారణా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో డీఎంహెచ్‌ఓ పాల్గొన్నారు. వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు దానయ్య, స్వర్ణమార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని
వ్యక్తి మృతి
తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని రామానుజవరానికి చెందిన దర్శనాల వెంకటేశ్వర్లు(60) మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ తిరుగుతున్నాడు. మిట్టపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఓ షాపులో మద్యం తాగి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన అల్లుడు బీరెల్లి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి..
వేంసూరు: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లింగపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంపల్లి ఈశ్వరాచారి(42) ఇంటి మందు ఉన్న కార్పెంటర్ షెడ్‌లో పడి ఉన్న విద్యుత్ వైర్‌ను సరిచేస్తున్నాడు. ఈక్రమంలో షాక్‌కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వరాచారి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరప్రసాద్ తెలిపారు.
వడదెబ్బతో బాలిక..
రఘునాథపాలె: వడదెబ్బ బారిన పడిన విద్యార్థిని మృతి చెందింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు కస్తాల రాంబాబు – రాణి దంపతుల చిన్న కుమార్తె శరణ్య(14) ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవుల నేపథ్యాన కొత్తగూడెంలోని బంధువులు ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్‌లో చేర్చేందుకు సిద్ధమవుతుండగా వడదెబ్బతో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

ఈనెల 21నుంచి ఎన్‌సీసీ క్యాంప్

ఈనెల 21నుంచి ఎన్‌సీసీ క్యాంప్