
● ప్రకృతి ఒడిలో వేసవి సంబురం
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా వలస ఆదివాసీ పిల్లలు ప్రకృతి ఒడిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు, కొండలు, కోనలు వారి ఆట స్థలాలు. పట్టణాల్లో సెల్‌ఫోన్లు, టీవీలకు పరిమితమయ్యే పిల్లలకు భిన్నంగా ఆదివాసీ పిల్లలు ప్రకృతితో మమేకమై స్వేచ్ఛగా ఆడుకుంటూ... పాడుకుంటూ తమ సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామంలో ఓ చెట్టుకు పాత చీరలను కట్టుకొని ఉయ్యాలా ఊగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఆ దృష్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – కరకగూడెం