
కురుస్తున్న పెద్దాస్పత్రి భవనం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం పెద్దాస్పత్రిలోని పాత భవనం చిన్నపాటి వర్షానికి సైతం కురుస్తోంది. భవనం పైఅంతస్తులో కార్యాలయం, ల్యాబ్‌లు, కింది అంతస్తులోని డయాలసిస్ కేంద్రం, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం క్లినిక్ నిర్వహిస్తున్నారు. అయితే భవనం నిర్మించి 60 ఏళ్లు దాటడంతో శిథిలావస్థకు చేరింది. ఈనేపథ్యాన గురువారం రాత్రి కురిసిన వర్షానికి శుక్రవారం ఉదయం వరకు నీటి ధారలు కారుతూనే ఉన్నాయి. దీంతో సిబ్బంది పలుచోట్ల థర్మకోల్ పెట్టెలు పెట్టి నిండగానే నీటిని బయట పారబో శారు. వర్షాకాలంలో సమస్య తీవ్రరూపం దాల్చనున్నందున అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.