కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల సంరక్షణకు పోరాటం చేస్తాం. అవసరమైతే గోకాక్‌ ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కన్నడ సినీ నటుడు టెన్నిస్‌ కృష్ణన్‌ తెలిపారు. గురువారం ఆర్‌టీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, బీదర్‌, కలబుర్గి, కోలార్‌, చింతామణి, బాగేపల్లి, కాసరగోడు వంటి ప్రాంతాల్లో కన్నడ భాషకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ భాషను రక్షించడంతో పాటు కన్నడిగులకు ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్య పరిచి గోకాక్‌ తరహా ఉద్యమానికి ముందుకు వస్తామని పేర్కొన్నారు. కుమార్‌, బసవరాజ్‌, హనుమేష్‌ నాయక్‌, నాగప్ప, గోవిందు, శరణ బసవ, అమరేష్‌, మంజునాథ్‌, నాగనలింగ గౌడ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement