రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు అగ్ని దివ్య గోపి డిమాండ్ చేశారు. గురువారం కొప్పళ జెస్కాం కార్యాలయం వద్ద 30 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా బాధ్యతలను టాటా పవర్ కంపెనీకి అప్పగించే ముందు కేపీటీసీఎల్ అధికారులతో చర్చించి, తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఒత్తిడి చేశారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.


