ప్రజ్వల్ ఏ తప్పు చేయలేదు!
● శిక్ష రద్దు కోసం హైకోర్టులో వాదనలు
యశవంతపుర: జేడీఎస్ మాజీ ఎంపీ, రేప్ కేసులో జైల్లో ఉన్న హెచ్‌డీ ప్రజ్వల్ రేవణ్ణ పరప్పన సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తూ, బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. పనిమని షిపై అత్యాచారం కేసులో విధించిన యావజ్జీవిత కారాగార శిక్షను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ప్రజ్వల్ తరఫున ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వచ్చి వాదనలను వినిపించారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు పొసగడం లేదు, ప్రజ్వల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవు, ఘటన జరిగిన నాలుగేళ్లు తరువాత కేసు నమోదైంది. ఒక వీడియోను సాక్ష్యంగా తీసుకోవడం సాధ్యం కాదని ఇంకా పలు అనేక అంశాల గురించి లూద్రా వాదించారు. కారాగార శిక్షను సస్పెండ్ చేసి బెయిల్‌ను మంజూరు చేయాలని మనవి చేశారు. న్యాయమూర్తులు కేఎస్ ముదగల్, టీ వెంకటేశ్ నాయక్‌లు వాదనలను ఆలకించి 24వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజు ప్రభుత్వం తరఫున వకీళ్లు వాదనలు వినిపించే అవకాశం ఉంది.
దేశ ప్రగతికి నెహ్రూ
పునాది: సీఎం
శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 900 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను ఓపెన్ చేస్తున్నామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. శుక్రవారం విధానసౌధ బ్యాంక్వెట్ హాల్‌లో దివంగత నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాలను ఆచరించారు. శాసీ్త్రయమైన మనోభావం కలిగిన బాలల ద్వారానే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నెహ్రూ తమ యవ్వనంలో 3,200కు పైగా రోజులను జైలులో గడిపిన పోరాటనాయకుడని కొనియాడారు. దేశ ప్రధానిగా అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధికి పునాది వేశారని అన్నారు. నెహ్రూ, గాంధీ సేవలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అనేకమంది గొప్పవారు పేద కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారు. అందుచేత ఈ సంవత్సరం మొత్తం 900 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలురంగాల ప్రముఖులను సన్మానించారు.
కొత్తగా 7 లక్షల మందికి షుగర్ జబ్బు
శివాజీనగర: ఆరోగ్యశాఖ ఏప్రిల్ 1, 2025 నుంచి గృహ ఆరోగ్య కార్యక్రమం కింద రాష్ట్రంలో 20,44,204 ఇళ్లల్లో 64 లక్షల మందికి ఉచిత మధుమేహ పరీక్షలు నిర్వహించింది. ఆరు నెలల్లో 32,99,798 మంది పురుషులు, 33,92,486 మంది సీ్త్రలకు మధుమేహం పరీక్షలు జరిపినట్లు ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు చెప్పారు. కొత్తగా 3,69,934 మంది పురుషుల్లో, 4,00,481 మంది సీ్త్రలలో మధుమేహం నిర్ధారణ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇదివరకే 9,59,769 మంది పురుషులు, 10,32,584 మంది వనితలకు షుగర్ జబ్బు నిర్ధారణ అయింది. వారికి ఉచిత చికిత్స, ఔషధాలను అందిస్తున్నట్లు, చక్కెర వ్యాధి గురించి భయం అవసరం లేదు, అలాగని నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. మంచి జీవిత విధానం ద్వారా ఆరంభంలోనే మధుమేహాన్ని అరికట్టవచ్చని అన్నారు.
ప్రజ్వల్ ఏ తప్పు చేయలేదు!


