
చిన్నయ్య మిత్రుని ఇంట్లో సోదాలు
బనశంకరి: తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, సిట్ అధికారులు తమ కుటుంబ సభ్యులను విచారణ చేశారని జయంత్ భార్య శైమా తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన శైమా ధర్మస్థల కేసులో అరైస్టెన చిన్నయ్య మా ఇంటికి మూడు నాలుగు నెలల క్రితం రెండుసార్లు వచ్చి జయంత్‌ను కలిశారు. అతనికి భోజనం పెట్టాం, నాకు జయంత్‌తో 2003లో పెళ్లయింది. అప్పటి నుంచి బెంగళూరు మల్లసంద్రలో నివాసం ఉంటున్నాం, నేను స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండగా, జయంత్ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నారు, అతనికి ఎక్కడి నుంచి డబ్బులు రాలేదని ఆమె చెప్పారు. చిన్నయ్య ను టీవీల్లో చూశామన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయం కోసం పోరాడుతున్నారని, ధర్మస్థల కు వ్యతిరేకం కాదని అన్నారు. మంజునాథస్వామిని, అణ్ణప్ప ను వదులుకోమన్నారు. సిట్ అధికారులు తనను, పిల్లలను కూడా ప్రశ్నించారని, ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని అన్నారు.