శ్రీక్షేత్రం మీద తీవ్ర కుట్ర! | - | Sakshi
Sakshi News home page

శ్రీక్షేత్రం మీద తీవ్ర కుట్ర!

Sep 1 2025 10:27 AM | Updated on Sep 1 2025 10:27 AM

శ్రీక

శ్రీక్షేత్రం మీద తీవ్ర కుట్ర!

బనశంకరి: ధర్మస్థల పుణ్యక్షేత్రంలో జరగరానివన్నీ జరుగుతున్నాయని కొన్నినెలలుగా తీవ్ర దుష్ప్రచారం సాగడం తెలిసిందే. ఇందులో ప్రధాన నిందితుడు చిన్నయ్య ఇప్పుడు సిట్‌ విచారణలో ఉన్నాడు. తెర వెనుక ఏమేం జరిగిందీ అతడు విచారణలో నోరు విప్పాడు. శ్రీక్షేత్రానికి వ్యతిరేకంగా కుట్ర నాలుగైదు నెలల క్రితం బెంగళూరు నగరంలోని ఎస్‌పీ మ్యాన్సన్‌ సర్వీస్‌ అపార్టుమెంట్‌లో రూపొందించినట్లు సమాచారం. దీనికి ఢిల్లీ వ్యక్తి మద్దతు ఇచ్చారనే సమాచారం సిట్‌ దర్యాప్తులో లభ్యమైంది.

పుర్రె తీసుకుని ఢిల్లీకి

చిన్నయ్య తెచ్చిన పుర్రె ఎవరిదనేది కనిపెట్టడానికి సిట్‌ అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడెక్కడ పెట్టారు అనేది ఆరా తీస్తున్నారు. పుర్రె తీసుకుని చిన్నయ్య, అతని మిత్రుడు జయంత్‌ ఢిల్లీకి రైలులో ప్రయాణించారు. మిగిలిన కొందరు ప్రముఖులు విమానంలో ప్రయాణించి ఢిల్లీలో ప్రముఖ వ్యక్తిని కలిశారు. అంతేగాక సుప్రీంకోర్టు న్యాయవాదితో చర్చించినట్లు సిట్‌ విచారణలో తెలిసింది. విమానంలో పుర్రెతో వెళ్తే తనిఖీలలో దొరికిపోతామని చిన్నయ్యతో రైలులో పంపించారు. అరైస్టెన చిన్నయ్యను శనివారం బెంగళూరుకు తీసుకువచ్చిన సిట్‌ అధికారులు జయంత్‌ నివాసంతో 10 గంటలపాటు గాలించి పలు ముఖ్యమైన వస్తు సామగ్రిని సీజ్‌ చేసినట్లు తెలిసింది. సర్వీస్‌ అపార్టుమెంట్‌లో ఎవరి పేరుతో రూమ్‌ బుక్‌ చేశారు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాలను సేకరించారు. ఏయే స్థలాల్లో భేటీ అయ్యారు, ఏమేం చర్చించారు అనేది చిన్నయ్య నుంచి సేకరిస్తున్నారు. దీనిని బట్టి ధర్మస్థల మీద బురదచల్లేలా పెద్ద కుట్రే జరిగిందని ఆరోపణలున్నాయి. కుట్రలో పాత్రధారులను ఒక్కొక్కరినే గుర్తించి సోదాలు చేస్తున్నారు, త్వరలో ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. బెంగళూరులో చిన్నయ్యను తీసుకువచ్చి పటిష్ట భద్రత మధ్య రెండు చోట్ల తనిఖీలు చేసిన సిట్‌ అధికారులు తరువాత బెళ్తంగడి సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ధర్మస్థలలో తవ్వకాల వద్ద పోలీసులు

బెంగళూరులో లాడ్జి, ఓ

అపార్టుమెంటులో భేటీలు

చిన్నయ్యను తీసుకుని సిట్‌

అధికారుల తనిఖీలు

ఇక ఎవరి సావాసం వద్దు: సుజాతభట్‌

ిసట్‌ విచారణలో తనకు తెలిసిన అన్ని విషయాలను తెలిపానని, ఇకపై ఈ కూపంలో ఉండనని వృద్ధురాలు సుజాతభట్‌ తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎవరెవరు ఏమి చేశారో దానికి తగినట్లు అనుభవిస్తారని, నేను ఒంటరిగా సిట్‌ విచారణ ఎదుర్కొని వచ్చానన్నారు. ఇకపై తనకు ఎవరి సహవాసం వద్దని, ఈ అవస్థల్లో ఉండనని అన్నారు. అదృశ్యమైందని తెలిపిన వాసంతి బతికే ఉందని తన మనసు చెబుతోందని, దీని పై దర్యాప్తు చేయాలన్నారు. వాసంతి శవం నదిలో చిక్కిందని చెప్పగా, ఆ మృతదేహాన్ని భర్త ఇంటివారికి చూపించలేదని చెప్పారు. కానీ ఆమె జీవించి ఉందని తనకు అనుమానం ఉందన్నారు. అనన్య భట్‌ విషయంలో చెప్పాల్సినవన్నీ చెప్పానన్నారు.

ఓ లాడ్జిలో కుట్ర చర్చలు

సిలికాన్‌ సిటీలో విద్యారణ్యపుర తిండ్లు సర్కిల్‌లోని లాడ్జిలో పలుమార్లు సూత్రధారులు, పాత్రధారులు చర్చలు జరిపినట్లు సిట్‌ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిట్‌ అధికారులు ఆదివారం ఉదయం చిన్నయ్యను తీసుకువచ్చి తిండ్లు సర్కిల్‌లోని సర్వీస్‌ అపార్టుమెంట్‌లో పరిశీలించారు. ఈ సమయంలో లాడ్జీలో సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకుని లాడ్జి సిబ్బందిని విచారించి సమాచారం రాబట్టారు. లాడ్జి, సర్వీస్‌ అపార్టుమెంట్‌లో కస్టమర్ల నమోదు రిజిస్టర్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీక్షేత్రం మీద తీవ్ర కుట్ర!1
1/1

శ్రీక్షేత్రం మీద తీవ్ర కుట్ర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement