
మూడురోజుల పాటు మద్యం దుకాణాలు బంద్
తమిళనాడు: ఈనెల 10న రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో కర్ణాటకలో మూడురోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
ఈ నెల 8 తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. 10 తేదీ పోలింగ్ జరుగుతుంది. 13న ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో మళ్లీ 12 తేదీ అర్దరాత్రి నుంచి 13 తేదీ అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. అంతటా వైన్ షాపులు, బార్లను మూసివేయాలని, అక్రమంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.