
మహిళా సంఘం సభ్యులకు విద్యనందించాలి
కరీంనగర్: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను పదోతరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేర్పించి మరింత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం విద్యాశాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మహిళా గ్రూపుల్లోని సభ్యుల్లో అర్హతను బట్టి పదోతరగతి, ఇంటర్ ఓపెన్‌స్కూల్‌లో ప్రవేశాలు పొందేలా చూడాలన్నారు. అంగన్‌వాడీల నుంచి పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరిని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించే విధంగా చూడాలన్నారు. విద్యాశాఖ తరఫున యూట్యూబ్ చానల్ స్థాపించాలని సూచించారు. భవిత కేంద్రాలను బలో పేతం చేయాలన్నారు. డీఆర్‌డీవో శ్రీధర్, మెప్మా పీడీ వేణుమాధవ్, డీఈవో మొండయ్య, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, కోఆర్డినేటర్లు ఆంజనేయులు, మిల్కూరి శ్రీనివాస్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
అదనపు వసూళ్లు చేస్తే రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం
జిల్లాలోని కొన్ని మీసేవా కేంద్రాల్లో పదోతరగతి, ఇంటర్ ఓపెన్‌స్కూల్(దూరవిద్య) కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల నుంచి చెల్లించాల్సిన ఫీజు కన్నా అదనంగా రూ.300వరకు మీ సేవ నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటివారి రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. మీ సేవలో అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే 0878–2997247 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలన
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యార్థుల వసతి గృహం, హాస్పిటల్లో ఉన్న వసతులను నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ పమేలా సత్పతితో బృందం సభ్యులు చర్చించారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శివరాం ప్రసాద్, రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, టీజీఎంఐడీసీ విశ్వప్రసాద్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు.
పదోతరగతి, ఇంటర్ ఓపెన్‌స్కూల్‌లో చేర్పించాలి
విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి

మహిళా సంఘం సభ్యులకు విద్యనందించాలి