
స్తంభాలపై అల్లుకున్న ప్రమాదం
సిరిసిల్లఅర్బన్: ఇంటర్‌నెట్ వైర్లు.. డిష్‌వైర్లు కరెంట్ స్తంభాలపై వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో కరెంట్ స్తంభాలపై ప్రమాదకరంగా వివిధ రకాల తీగలు వెళ్తున్నాయి. విద్యుత్ స్తంభాలపై చిందరవందరగ వెళ్తుండడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా సెస్ అధికారులు కరెంటు స్తంభాలపై ఏర్పాటు చేసిన వైర్లను సరిచేసి జరుగకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
ప్రమాదాలు ఇలా..
● జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో ఓ విద్యుత్ స్తంభంపై డిష్‌కేబుల్ వైర్లు, నెట్ కేబుల్‌వైర్లు, విద్యుత్తు వైర్లు తగిలి షార్ట్‌సర్కూట్‌తో విద్యుత్తు స్తంభంపై ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డిష్‌వైర్లతోనే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయి.
● గీతానగర్ స్కూల్ ప్రహరీని ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న మీటర్‌బాక్స్‌కు డిష్, ఇంటర్‌నెట్‌కు సంబంఽధించిన వైర్లు తగిలి షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయి.
● సిరిసిల్ల పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్‌మెంట్ ఫ్లెక్సీ విద్యుత్ తీగలకు తగిలి మంటలు చెలరేగాయి.
● జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద గల ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట గల ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై లూజువైర్లు తగిలి నిప్పురవ్వలు పడి ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న చెత్త,చెదారానికి అంటుకొని ఒక్కసారిగా మంటలు లేచాయి.
ఇంటర్‌నెట్, డిష్‌కేబుళ్లతో షార్ట్‌సర్క్యూట్
చెలరేగుతున్న మంటలు
భయాందోళనలో స్థానికులు
పోల్ రెంటల్ చార్జీలు వసూలు చేస్తాం
సిరిసిల్ల పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను కేబుల్ ఆపరేటర్లు తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. తీగలను గుర్తించి వారి నుంచి ఎన్పీడీసీఎల్ నింబంధనల ప్రకారం పోల్ రెంటల్ చార్జీలను వసూలు చేయాలని 10 రోజుల క్రితమే నిర్ణయించాం. కేబుల్ ఆపరేటర్లతో కూడా చర్చించాం. విద్యుత్‌పోల్‌పై చిందరవందరగా వైర్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.
– రామసుబ్బారెడ్డి, సెస్ ఏడీఏ

స్తంభాలపై అల్లుకున్న ప్రమాదం