
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు.