
యువకుల ప్రాణాలు కాపాడిన లోకో పైలెట్లు
ఫెర్టీలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ గౌతమినగర్ రైల్వేగేట్ వద్ద ఇద్దరు యువకులను లోకో పైలెట్లు కాపాడారు. మూసి ఉన్న రైలు గేట్ దాటేందుకు యువకులు ప్రయత్నం చేయగా.. స్కూటీ పట్టాల కంకరలో కూరుకుపోయింది. అప్పటికే సింగరేణి బొగ్గులోడ్‌తో గూడ్స్‌రైలు వేగంగా దూసుకు వస్తోంది. అయితే, ట్రాక్‌పై ఉన్న యువకులను గుర్తించిన లోకో పైలెట్ సీహెచ్ రవి, అసిస్టెంట్ లోకో పైలెట్ దీపక్ కుమార్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును ఆపారు. దీంతో గేట్ వద్ద ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సాయంతో ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేశారు. ప్రమాదం జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన లోకో పైలెట్లను స్థానికులు అభినందించారు.