
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు పోలీసులను చూసి వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. ఎస్‌ఐ లక్ష్మారెడ్డి విచారణ జరపగా.. కరీంనగర్‌కు చెందిన మర్రి దీక్షిత్, సిద్ధార్థ, శశిధర్‌గా గుర్తించారు. ఎస్‌ఐ ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా.. గంజాయి ప్యాకెట్లు లభించాయి. రూరల్ స్టేషన్‌కు ముగ్గురు యువకులను తరలించి విచారణ చేపట్టారు. మర్రి దీక్షిత్ కొంతకాలంగా ఆంధ్రా నుంచి గంజాయి అక్రమంగా తెప్పిస్తూ ఇతరులకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువకుల నుంచి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టుకు తరలించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.