గంగాధర: కరీంనగర్– జగిత్యాల ప్రధా న రహదారిలో గతనెల 30న ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆయన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వేముల రవి(42) గత నెల 30న తన తమ్ముడు, కొడుకుతో కలిసి కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మధురానగర్ శివారులో ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురు కింద పడగా వెనుకాల కూర్చున్న వేముల రవికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వేముల లచ్చయ్య ఫిర్యాదుతో బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.
గడ్డి మందు తాగి వివాహిత..
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని తిప్పాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఐశ్వర్య అలియాస్ శైలజ బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐశ్వర్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మరణించింది. మృతురాలికి భర్త లక్ష్మణ్, కొడుకు ఆర్యన్(2) ఉన్నారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లంతకుంట ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని గాలిపల్లికి చెందిన దండు శ్రీనివాస్(40) గత పదమూడేళ్లుగా చీర్లవంచలోని తన అక్క వద్ద ఉంటున్నాడు. ఒంటరితనంతో ఏమి చేయాలో తోచక రెండు రోజుల క్రితం తన స్వగ్రామం గాలిపల్లిలో ఉన్న తన అన్న ఎల్ల య్య ఇంటికి వచ్చాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని అన్న ఎల్లయ్య ఫిర్యాదుతో ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకుని వివాహిత..
ధర్మపురి: ఇంట్లో జరిగిన చిన్న గొడవకు మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన సమ్మయ్యతో బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన శ్రీవాణితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు అజయ్, కూతురు అక్షిత ఉన్నారు. సమయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో తన పిల్లలతో గొడవ పడింది. క్షణికావేశంలో ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పిల్లలు కొద్దిసేపటికి గమనించి గట్టిగా అరవడంతో ఇంటి పక్కనున్న బంధువులు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి శ్రీవాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీవాణి తండ్రి సంపంగి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
చికిత్స పొందుతూ ఒకరి మృతి