
చర్చి నిర్మాణ పనులు అడ్డగింత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో నిర్మిస్తున్న చర్చి పనులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వాదోపవాదనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చించారు. బీజేపీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో చర్చి నిర్మించొద్దని రైతులు గ్రామపంచాయతీ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయం తెలిసి తాము పనులు అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు దారితీయడంలో పోలీసులు సముదాయించారు. అక్కడి నుంచే తహసీల్దార్, ఎంపీడీవోలతో ఫోన్‌లో బీజేపీ నాయకులు మాట్లాడి.. చర్చి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. నాయకులు నంది నరేశ్, మారవేణి రంజిత్‌కుమార్, దాసరి గణేశ్, గ్రామస్తులు ఉన్నారు.