కరీంనగర్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం

Dec 28 2023 2:12 AM | Updated on Dec 28 2023 11:37 AM

- - Sakshi

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌లోని విద్యారణ్యపురి కాలనీకి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కనుకుంట్ల స్వప్న–నరసింహ దంపతుల కూతురు వశిష్టకృష్ణ(12) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. తిరిగి కరీంనగర్‌కు వచ్చేందుకు వశిష్టకృష్ణను ఆమె తాతయ్య బుధవారం ఉదయం పెద్దపల్లిలో బస్సు ఎక్కించాడు.

ఆ బస్సును ఫొటో తీసి, నరసింహకు ఫోన్‌లో పంపించాడు. దీంతో ఆయన కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో ఎదురుచూశా డు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన బస్సులో నుంచి వశిష్టకృష్ణ దిగలేదు. కండక్టర్‌ను అడిగితే బొమ్మకల్‌ బ్రిడ్జి వద్ద దిగినట్లు చెప్పా డు. వెంటనే అక్కడికి వెళ్లి వెతికినా కనిపించకపోవడంతో నరసింహ కరీంనగర్‌రూరల్‌ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు అదృశ్యం కేసు నమోదు చేసుకొని, బాలిక ఆచూకీ వెతుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement