
ఎఫ్‌సీఎస్‌లో నాటకీయ పరిణామాలు
కామారెడ్డి అర్బన్: జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం(ఎఫ్‌సీఎస్) అధ్యక్షుడిగా నియమితులైన పెద్ద సాయిలు.. 24 గంటల్లో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. గాదం సత్యనారాయణకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు.
లింగంపేట మండలంలోని మోతె గ్రామానికి చెందిన గాదం సత్యనారాయణ గతంలో జి ల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన గ్రామంలో నివసించడం లేదన్న కారణంతో అక్కడి సంఘంలో ప్రాథమిక సభ్యత్వం తొలగించారు. దీంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిని కోల్పోయారు. కాగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉ న్న పసుపుల పెద్ద సాయిలును సోమవారం జి ల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే తన సభ్యత్వం రద్దు విషయంలో సత్యనారాయణ సహకార ట్రిబ్యునల్ నుంచి స్టే ఆర్డర్ తీసుకువచ్చి సోమవారం సాయంత్రం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతికి అందించారు. దీంతో మంగళవారం స్టే ఆర్డర్‌ను అమలు చేయడంతో పెద్ద సాయిలు పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ డోలిసింగ్ మంగళవారం మధ్యాహ్నం సత్యనారాయణను అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గాదం సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని డోలిసింగ్ తెలిపారు.
24 గంటల్లోనే పదవిని
కోల్పోయిన పెద్దసాయిలు
మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా
సత్యనారాయణకే బాధ్యతలు