
ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎస్సీ, ఎ స్టీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శని వారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌చంద్ర, అధికారులు పు ష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. జిల్లా అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులపై కమిషన్ సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకట య్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం ఉన్న చ ట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతినెల చివరి వారంలో సివిల్ రై ట్స్‌డే ను, ప్రతి మూడు నెలలకోసారి డీవీఎంసీ స మావేశాన్ని నిర్వహించి సమస్యలను పరిష్కరించా లన్నారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమి టీని ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశానికి హాజరై న పలువురు జిల్లా వాసులు తమకు సంబంధించిన కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కల్పించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య