
ప్రారంభమైన అర్ధచాతుర్మాస్య ఉత్సవాలు
కామారెడ్డి అర్బన్: స్థానిక సిరిసిల్లరోడ్డులోని గీతా మందిరం 43వ అర్ధ చాతుర్మాస్య మహావ్రత ఉత్సవాలు తొలిఏకాదశి సందర్భంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఉత్సవాల ప్రారంభ సూచికగా గీతా మందిరం అధ్యక్షుడు పాత అశోక్ కాషాయజెండాను ఎగురవేశారు. ఈ నెల 9వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ధరానంద భారతి స్వామీజీ ఓంకార గాయత్రి వేద జ్ఞానప్రవచనాలు చేస్తారని అధ్యక్షుడు అశోక్ తెలిపారు. గీతా మంది రం ప్రతినిధులు అర్వపల్లి రమేష్, పార్శి లక్ష్మిపతి, దోమకొండ కృష్ణమూర్తి, అర్చకులు పాల్గొన్నారు.