
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మద్నూర్(జుక్కల్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఆ ర్‌ఐ సాయిబాబా ఆదివారం తెలిపారు. పొతంగాల్ మంజీరానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా లింబూర్ గ్రామం వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్‌ను పట్టుకున్నామని అన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
పశువులను తరలిస్తున్న వాహనం..
రుద్రూర్: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శనివారం రా త్రి రుద్రూర్ మండల కేంద్రంలో పట్టుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపా రు. రాజీవ్ నగర్ కాలనీ వద్ద బొలెరో వాహనాన్ని పట్టుకొని అందులో ఉన్న ఎనిమిది ఎద్దులను స్థానిక గోశాలకు తరలించామన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి
బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట్ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మహిళను గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో మృతిచెందింది. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ హరికృష్ణకు తెలుపగా, ఆయన నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని రైలు రాకను గుర్తించకుండా గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలిని గుర్తించేందుకు ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతురాలి వయస్సు సుమారు యాభై ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలిని గుర్తించిన వారు నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్సై సాయిరెడ్డి, 8712658591, 9493451642 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మాన్యాపూర్‌లో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని మాన్యాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. మాన్యాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (35) కుటుంబంలో గతకొన్ని రోజులు గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాధిత కుటుంబానికి చేయూత
నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్య రెండు నెలల క్రితం ఓ ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబానికి ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానిస్టేబుల్ 2004బ్యాచ్ సభ్యులు .3లక్షలు అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ బ్యాచ్‌కు చెందిన బుచ్చయ్య ఆకస్మిక మరణం తీరని లోటు అన్నారు. కానిస్టేబుల్‌లు నాయిని గంగారాం, నర్సింగ్, సురేష్, రాజశేఖర్, నరేష్, సాయిలు, శైలేష్, నేతా స్వప్న, ఇంద్ర, అనిల్ పాల్గొన్నారు.
మేకల మందపై చిరుత దాడి
నవీపేట: మండలంలోని మిట్టిపూర్ శివారులో ఆదివారం సాయంత్రం మేక ల మందపై చిరుత దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన మేకల కాపరి భీమన్న గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా మందపై చిరుతపులి దాడి చేసింది. ఒక మేకపై దాడి చేసి, మళ్లీ చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లు బాధితులు తెలిపారు.