
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అస్వస్థత
రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులోగల ఆదర్శ కళాశాల (మోడల్ స్కూల్/కళాశాల)లో పలువురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారంతా రాత్రివేళ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో కేర్ టేకర్ సుజాత రుద్రూర్ పీహెచ్‌సీ సమాచారం అందించారు. మండల వైద్యాధికారిణి అయేషా సిద్ధికా, ఆరోగ్య సిబ్బంది హాస్టల్‌కు చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. సుమారు 95మంది విద్యార్థినులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. తీవ్ర అస్వస్థతతకు గురైన 8మంది విద్యార్థినులను వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. శనివారం సాయంత్రం నలుగురిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యాధికారిణి వెల్లడించారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన ఐరన్ మాత్రలను తినకముందు వేసుకోవడం వల్ల అస్వస్థత గురైనట్లు ఆమె వివరించారు.