
కనిపించని డ్రెయినేజీలు
కామారెడ్డి టౌన్ : చిన్నపాటి వర్షం కురిస్తే కామారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే రాకపో కలు నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. దీని కి కారణం పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను ఆక్రమణలకు గురి కావడమే.. పలు ప్రాంతాల్లో అస లు నాలాల జాడ కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులు డ్రెయినేజీలపై స్లాబ్ లు వే సుకోగా.. మరికొన్ని చోట్ల వ్యాపారులు నాలాలను కబ్జా చేసి వ్యాపారాలు సాగిస్తు న్నారు. వర్షపు, మురుగునీరు ప్రవహించేందు కు దారి లేకుండాపోయింది. బల్దియా పారిశుద్ధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేద్దామ న్నా చేసే పరిస్థితి లేదు. దీంతో డ్రెయినేజీలు వ్యర్థాలు, పూడికతో నిండిపోవడంతో మురు గు నీరు ముందుకు ప్రవహించడం లేదు. డ్రెయినేజీలను దాటి శాశ్వత నిర్మాణాలు చేపట్టినా అడిగేవారు లేకుండా పోయారు. బల్దియా అధికారుల పర్యవేక్షణ కరువైంది.
ఎక్కడ చూసినా..
కొత్తబస్టాండ్ నుంచి మున్సిపల్‌కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా నుంచి హౌజింగ్‌బోర్డు వైపు వరకు ఇరువైపులా పూర్తిగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. ఈ రోడ్ల వెంబడి మురికి కాలువల ఆనవాళ్లు లేకుండా స్లాబులు వేసి వాటిపై వ్యాపారాలు సాగిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు ఇరు వైపులా ఇదే పరిస్థితి. ఇక స్టేషన్‌రోడ్, సిరిసిల్ల రోడ్, సుభాష్‌రోడ్, మాయాబజార్, నాజ్ టాకీస్‌రోడ్, గంజ్‌రోడ్, వీక్లీ మార్కెట్‌రోడ్, జన్మభూమిరోడ్, ఆర్‌కే లాడ్జ్ రోడ్, అశోక్‌నగర్ కాలనీ, పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీల ఆనవాళ్లు కనిపించడం లేదు.
వానాకాలంలో అటువైపు వెళ్లలేం..
మురికి కాలువల ఆక్రమణలు, వాటిపై స్లాబ్ లు వేయడంతో విద్యానగర్‌కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ ముందు, పాత బస్టాండ్, సిరిసిల్లారోడ్, దేవునిపల్లిరోడ్, రామారెడ్డిరోడ్, అడ్లూర్‌రోడ్ తదితర ప్రధాన రహదారులపై రోడ్లు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. వాహనదారులు, పాదచారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉంది.
యథేచ్ఛగా ఆక్రమణలు..
వాటిపై నిర్మాణాలు
జిల్లా కేంద్రంలో నాలాలపై
పర్యవేక్షణ కరువు
వానాకాలంలో రోడ్లను
ముంచెత్తుతున్న వరద నీరు
పట్టించుకోని బల్దియా అధికారులు
చర్యలు చేపడుతాం..
పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలిగించాలి. కాలువలపై స్లాబ్‌లు వేసుకుంటే తీసివేయాలి. మున్సిపల్ కార్మికులు డ్రెయినేజీలను శుభ్రం చేసేలా ఉండాలి. లేకుంటే ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటాం. మురికి కాలువలపై ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపడతాం.
– రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి

కనిపించని డ్రెయినేజీలు

కనిపించని డ్రెయినేజీలు

కనిపించని డ్రెయినేజీలు

కనిపించని డ్రెయినేజీలు

కనిపించని డ్రెయినేజీలు