
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పదోన్నతి పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. జిల్లా లోని ఆయా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వారందరూ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పదోన్నతి చిహ్నాలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్ లభిస్తుందన్నారు. విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుపుతామన్నారు.
పదోన్నతి పొందిన అధికారుల వివరాలు..
కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న రామేశ్వర్ రెడ్డి (లింగంపేట్) మధుకర్ (ఎల్లారెడ్డి), దేవేందర్ (లింగంపేట్), బిఎం.రాజు (దేవునిపల్లి), సిహెచ్. సాయిలు (బిచ్కుంద), జి. రాజు కుమార్ (బిచ్కుంద) ప్రిన్స్ బాబు (వీఆర్), అనిల్ కుమార్ (రాజంపేట), రామారావు (మాచారెడ్డి), సీహెచ్ స్వామి (మాచారెడ్డి), సీహెచ్ శ్రీనివాస్ (నాగిరెడ్డిపేట్), సీహెచ్ మహేందర్ (వీఆర్) సంజీవులు (దేవునిపల్లి) లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించినట్లు ఎస్పీ తెలిపారు.
నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర