
స్పెషల్ డ్రైవ్‌లో 130 సెల్‌ఫోన్‌ల రికవరీ
కామారెడ్డి క్రైం: స్పెషల్ డ్రైవ్ ద్వారా 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 130 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని తెలిపారు. సెల్‌ఫోన్‌లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా ఆందోళనకు గురికావొద్దని, సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌ల రికవరీలో రాష్ట్రం లోని కమిషనరేట్‌లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సిమ్‌కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. సెల్‌ఫోన్‌ల రికవరీలో ప్రతిభ కనబర్చిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ అయిన ఫోన్‌ల వివరాలను బాధితులకు తెలుపుతామని, జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్‌ఎస్సై బాల్‌రాజు (87126 86114)ను సంప్రదించి తీపసుకువెళ్లాలని ఎస్పీ సూచించారు.