కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అ న్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో గురువారం సంక్షేమ శాఖ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ ఽఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొ న్నారు. చర్చి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కళాభారతి ఆడిటోరియం వరకు ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి వరప్రసాద్ అన్నారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్ కోసం శ్రమించాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్ధానాల్లో నిలవాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించే వారి వివరాలను తమ దృష్టికి తీసుకునిరావాలన్నారు. 1908, 1933, 1446 టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
1908కి సమాచారం ఇవ్వాలి
మత్తు పదార్థాలు సేవించడం కారణంగా చాలామంది విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ‘డ్రగ్స్ వాడము – ఇతరులను వాడనివ్వము’ అనే నినాదంతో యువత ముందుకు నడవాలన్నారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్ధాల సమాచారం తెలిస్తే 1908 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి నాగరాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, డీఈవో రాజు, ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
డ్రగ్స్ రహిత సమాజం కోసం ఉద్యమించాలి