
కళాభారతిలో ఆమని సందడి
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాభారతి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కుటుంబ సమేతంగా హాజరుకాగా.. సినీనటి ఆమని, టీవీ నటుడు ప్రభాకర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. 15 హిట్‌సాంగ్స్‌లతో కూడిన నృత్య రూపకంలో కళాకారులతో కలిసి ఆమని, ప్రభాకర్ నృత్యం చేశారు. కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకుడు, జాతీయ నృత్య కళాకారుడు వంశీప్రతాప్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కూచిపూడి కళాక్షేత్రం
వార్షికోత్సవం