
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
లింగంపేట/తాడ్వాయి/ రాజంపేట/బాన్సువాడ రూరల్ : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. లింగంపేట మండలం పొల్కంపేట, బాయంపల్లి గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ తెలిపారు.తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ రైతు వేదిక కార్యాలయంలో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్‌లపై మండల వ్యవసాయాధికారి నర్సింలు అవగాహన సదస్సు నిర్వహించారు. రాజంపేట మండలంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన కల్పించినట్లు కామారెడ్డి డివిజనల్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ తండాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు క్లస్టర్ ఏఈవో దత్తేశ్వరి తెలిపారు. ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాల సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటుందని, దీనికి రైతులందరూ ఆధార్ లింకు ఉన్న సెల్ ఫోన్, ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్ తెచ్చుకొని తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కామారెడ్డి డివిజనల్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ సూచించారు.ఈకార్యక్రమంలో ఏఈవోలు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు.

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి