
స్వల్పంగా కంపించిన భూమి
కామారెడ్డి అర్బన్/మాచారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది. కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి మండలంలోని సోమారంపేటలో సోమవారం సాయంత్రం భూకంపం వచ్చిందని ప్రజలు తెలిపారు. భూమి లోపలనుంచి పెద్దగా శబ్దాలు వచ్చాయని, భూమి కదిలినట్లు అనిపించిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్లలోనుంచి బయటికి పరుగులు తీశామన్నారు. జిల్లా కేంద్రంలో భూకంపం వచ్చిన సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో..
సిరికొండ/మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వ ల్పంగా భూమి కంపించిందని ప్రజలు తెలిపా రు. సిరికొండ మండల కేంద్రంతోపాటు మైలారం, నర్సింగ్‌పల్లి, చీమన్‌పల్లి, చిన్నవాల్గోట్, రావుట్ల, కుర్దుల్‌పేట్, హుస్సేన్‌నగర్‌లతోపాటు మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, మెండోరా మండల కేంద్రాల్లో స్వల్పంగా భూమి కంపించిందని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం భీమ్‌గల్, మెండోరా మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే.