
ఆదర్శంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు
ఎల్లారెడ్డిరూరల్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పదో తరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణతను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైననాటి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉపాధ్యాయులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలో మూడు జెడ్పీ, ఒక గురుకుల పాఠశాలలో వంద శాతం ఫలితాలు జిల్లాలో ఈఏడాది పదోతరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణతను 146 పాఠశాలలు సాధించాయి. వీటిలో జిల్లా పరిషత్ పాఠశాలలు 71, ప్రైవేటు పాఠశాలలు 45, కేజీబీవీలు 11, బీసీ వెల్ఫేర్ 07, మైనార్టీ రెసిడెన్షియల్ 02, సోషల్ వెల్ఫేర్ 03, ట్రైబల్ వెల్పేర్ 02,ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 03, మోడల్‌స్కూళ్లు 02 వంద శాతం ఫలితాలను సాధించాయి.
ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గత 9 ఏళ్లుగా వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ప్రఽ దానోపాధ్యాయులు బదిలీ అయినప్పటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అన్నాసాగర్ జెడ్పీ పాఠశాలలో 2015వ సంవత్సరం నుంచి వరుసగా వంద శాతం ఫలితాలు సాధిస్తున్నారు. వీరితో పా టు మండలంలోని వెల్లుట్ల జెడ్పీ పాఠశాల సైతం వరుసగా రెండోసారి పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధించింది. గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు సైతం వంద శాతం ఫలితాలను సాధించారు. ప్రతి పాఠానికి సంబంధించిన అంశాలను రోజు వారీగా స్లిప్ టెస్టు లు పెట్టి పాఠానికి సంబంధించిన జవాబులు నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రాత్రి పది గంటల వరకు చదవడంతో పాటు ఉదయం 5 గంటలనే నిద్ర లేచే వేకప్ కాల్ విధానంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తిని కలిగిస్తున్నారు.
జిల్లాలో వంద శాతం ఫలితాలు
సాధించిన 146 పాఠశాలలు
వరుసగా 9వ సారి వంద శాతం
సాధించిన జెడ్పీ అన్నాసాగర్ పాఠశాల
ప్రత్యేక తరగతులు ఉపయోగపడ్డాయి
పాఠశాలలో ఉదయం, సా యంత్రం సమయాలలో పదో తరగతికి ప్రత్యేక తరగతులను నిర్వహించేవారు.దీంతో పాఠశాల ముగిసిన తరువాత చదువుకునేందుకు సమయం దొరికేది. పాఠాలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేశారు. దీంతో మంచి మార్కులను సాధించాను. – అమూల్య, జెడ్పీ పాఠశాల, అన్నాసాగర్

ఆదర్శంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు