
రెండేళ్లయినా అందని సీఎం రిలీఫ్ ఫండ్
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఆర్‌బీ నగర్‌కి చెందిన కుతాడి ఎల్లవ్వది నిరుపేద కుటుంబం. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఎల్లవ్వకు 2022 లో నిత్యం బ్లీడింగ్ సమస్య రక్త హీనతతో పాటు బోన్ మ్యారో వ్యాధి వచ్చింది. భర్త కుతాడి ప్రశాంత్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించగా రూ.2.17 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో ఆకుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. ఎల్లవ్వ భర్త 2023 ఫిబ్రవరిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేశాడు. ఇప్పటివరకు మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి, ఉన్నతాధికారులను సైతం కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు సీఎంఆర్‌ఎఫ్ మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తమ ఆదుకోవాలని ఎల్లవ్వ భర్త ప్రశాంత్ కోరుతున్నాడు.
అనారోగ్యంతో పాటు ఆర్థిక
ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబం
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వేడుకోలు