
ఎప్‌సెట్ రాసి తిరిగి వెళ్తూ అనంతలోకాలకు..
జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానవత్ మంజుల(19), బానవత్ అశ్విని(17) శుక్రవారం ఎప్‌సెట్ రాసేందుకు కారులో హైదరాబాద్ వెళ్లారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. అర్గుల్ శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న అక్కా చెల్లెళ్లు మంజుల, బానవత్ అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న జాదవ్ హంసరాజుకు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నిర్మల్ జిల్లావాసులు మృతి

ఎప్‌సెట్ రాసి తిరిగి వెళ్తూ అనంతలోకాలకు..