
మాగాంలో కొండముచ్చు దాడి
ఐదుగురికి తీవ్ర గాయాలు
అయినవిల్లి: మాగం గ్రామంలో ఓ కొండముచ్చు రెండు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసింది. ఆ గ్రామానికి చెందిన బి.సత్యనారాయణ, బొడపాటి రాజేష్, కొట్టల శ్రీనులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో కొండముచ్చు దాడి చేసి గాయపరిచింది. ఇలా మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్తులు చెప్పారు. బాధితులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండముచ్చు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా 15 మందిపై దాడి చేసినా అధికారులు స్పందించలేదని అంటున్నారు. ఇప్పటికై నా కొండముచ్చులను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.