
బాస్కెట్ బాల్ రన్నర్‌గా ఏపీఎస్పీ
కాకినాడ రూరల్: రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కాలేజీలో ఈ నెల 13న జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ – 2025 రన్నర్‌గా కాకినాడ ఏపీఎస్పీ జట్టు నిలిచింది. ఈ విషయాన్ని ఏపీఎస్పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. రామచంద్రపురం జట్టుతో పైనల్ మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడిందన్నారు. పోటీలో పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన సోమవారం అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహేష్, శంకర్, రాజేష్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు.