కాకినాడ క్రైం: బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువత, విద్యార్థులు బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిని గమనించి బెట్టింగుల పట్ల ఆకర్షితులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112, 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94949 33233కు సమాచారం ఇవ్వాలన్నారు.