
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్
అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం కమిని గ్రామం వద్ద గోదావరిలో మృతిచెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, అండగా నిలవాలని జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అమలాపురంలో మంగళవారం యువకుల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల చాలామంది విద్యార్థులు, స్థానికులు మృతి చెందుతున్నారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కోనసీమ జెడ్పీటీసీ సభ్యులు, పందిరిశ్రీహరి రామ్‌గోపాల్, గెడ్డం సంపదరావు, కోనుకు గౌతమి, మట్టాశైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, పుట్టి కూడివీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా సంతాపం తెలిపారు.